శ్రీవారి భక్తులకు శుభవార్త విశాఖపట్నం నుంచి వీకెండ్‌ ‌తిరుమల దర్శన్‌

తిరుమల, జూన్‌ 27 : ‌తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం ఇప్పటికే తిరుమలకు పలు టూర్‌ ‌ప్యాకేజీలు ఆపరేట్‌ ‌చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విశాఖపట్నం నుంచి వీకెండ్‌ ‌తిరుమల దర్శన్‌ ‌టూర్‌ ‌ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ. ఈ టూర్‌ ‌ప్యాకేజీ ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్‌ ‌ప్యాకేజీ బుక్‌ ‌చేసుకున్న పర్యాటకులు తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకం, శ్రీనివాస మం గాపురం, తిరుచానూర్‌, ‌శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించుకోవచ్చు. ఈ టూర్‌ ‌ప్యాకేజీలోనే తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్‌ ‌కూడా కలిపే ఉంటుంది. వీకెండ్‌లో తిరుమల వెళ్లి, శ్రీవారిని దర్శించుకొని, తిరుపతి సమీపంలో ఆలయాలను చూసిరావాలనుకునేవారికి ఉపయోగపడే టూర్‌ ‌ప్యాకేజీ ఇది. ఐఆర్‌సీటీసీ వీకెండ్‌ ‌తిరుమల దర్శన్‌ ‌టూర్‌ ‌ప్రతీ శుక్రవారం విశాఖపట్నంలో ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నంలో తిరుమల ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాలి. రెండో రోజు ఉదయం 4.05 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌ ‌చేరుకుంటారు. హోటల్‌లో ఫ్రెషప్‌ అయిన తర్వాత కాణిపాకం, శ్రీనివాస మంగాపురం ఆలయాలను దర్శించుకోవచ్చు. రాత్రికి తిరుపతిలో బస చేయాలి. మూడో రోజు ఉదయం తిరు చానూర్‌, ‌శ్రీకాళహస్తి ఆలయాల దర్శనం ఉంటుంది. లంచ్‌ ‌తర్వాత తిరుమలలో స్పెషల్‌ ఎం‌ట్రీ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శిం చుకోవచ్చు.

దర్శనం తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. రాత్రి 8.30 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కితే నాలుగో రోజు ఉదయం 11.30 గంటలకు విశాఖ పట్నం చేరుకోవడంతో టూర్‌ ‌ముగుస్తుంది. ఐఆర్‌సీటీసీ వీకెండ్‌ ‌తిరుమల దర్శన్‌ ‌టూర్‌ ‌ప్యాకేజీ ధరలు చూస్తే కంఫర్ట్‌లో ట్రిపుల్‌ ఆక్యుపెన్సీకి రూ.12,375, డబుల్‌ ఆక్యుపెన్సీకి రూ.13,250, స్టాండర్డ్‌లో ట్రిపుల్‌ ఆక్యుపెన్సీకి రూ.10,280, డబుల్‌ ఆక్యుపెన్సీకి రూ.11, 160 చెల్లించాలి. నలుగు రి నుంచి ఆరుగురు బుక్‌ ‌చేసుకుంటే ఈ ప్యాకేజీ ధరలు వర్తిస్తాయి.  ఇక ఒకరి నుంచి ముగ్గురు బుక్‌ ‌చేసుకునేవారికి ప్యాకేజీ ధర కాస్త అధికంగా ఉంటుంది. కంఫర్ట్‌లో ట్రిపుల్‌ ఆక్యుపెన్సీకి రూ.12,695, డబుల్‌ ఆక్యుపెన్సీకి రూ.15,200, సింగిల్‌ ఆక్యుపెన్సీకి రూ.25,510, స్టాండర్డ్‌లో ట్రిపుల్‌ ఆక్యుపెన్సీకి రూ.10,600, డబుల్‌ ఆక్యుపెన్సీకి రూ.13,105, సింగిల్‌ ఆక్యుపెన్సీకి రూ.23,415 చెల్లించాలి. టూర్‌ ‌ప్యాకేజీలో కంఫర్ట్ ‌క్లాస్‌కు థర్డ్ ఏసీ ప్రయాణం, స్టాండర్డ్ ‌క్లాస్‌కు స్లీపర్‌ ‌క్లాస్‌ ‌ప్రయాణం, ఏసీ హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, ‌డిన్నర్‌, ‌తిరుమలలో స్పెషల్‌ ఎం‌ట్రీ దర్శనం, కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూర్‌ ఆలయాల్లో దర్శనం టికెట్‌, ‌ట్రావెల్‌ ఇన్స్యూరెన్స్ ‌కవర్‌ అవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *