శ్రీ‌వారిని దర్శించుకున్న మంత్రి హరీష్‌ ‌రావు

తిరుమల,ప్రజాతంత్ర,ఆగస్ట్7: ‌కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల  శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి హరీశ్‌ ‌రావు  దంపతులు దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున తిరుమల చేరుకున్న హరీశ్‌ ‌దంపతులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వేంకటేశ్వరుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం రంగనాయకుల మండపంలో మంత్రి హరీశ్‌ ‌రావుకు వేదపండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.మంత్రి హరీశ్‌ ‌రావుతోపాటు రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి  రాష్ట్ర పర్యాటక శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరి శ్రీనివాస రాజులు, జాతీయ బీసీ కమిషన్‌ ‌చైర్మన్‌ ‌హన్సరాజ్‌ ‌గంగారాం కూడా శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *