శ్రీ‌లంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ ‌విక్రమ్‌ ‌సింఘే

  • అనూహ్యంగా ఆయననే ఎన్నుకున్న ఎంపిలు
  • ఆరుసార్లు ప్రధానిగా పనిచేసిన రాజకీయానుభవం
  • లంక క్లిస్ట పరిస్థితుల్లో ఉందన్న కొత్త అధ్యక్షుడు

కొలంబో,జూలై20: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ ‌విక్రమ సింఘే ఎన్నికయ్యారు. అన్యూహ్యం గా బుధవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధాని రణిల్‌ ‌విక్రమ సింఘే.. కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక య్యారు. లంక 8వ అధ్యక్షుడిగా విక్రమ సింఘేను ఎంపీలు ఎన్నుకున్నారు. బుధవారం జరిగిన ఓటింగ్‌లో విక్రమ సింఘేకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఆయన కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో విక్రమ సింఘేకు మద్దతుగా 134 ఓట్లు రాగా.. అలాహా పెరుమాకు 82 ఓట్లు, అనురాకుమారకు 3 ఓట్లు పడ్డాయి. కాగా, మొత్తం పోలైన ఓట్లు 219. ఇదిలా ఉండగా.. రణిల్‌ ‌విక్రమసింఘే ఇప్పటి వరకు లంక ప్రధానిగా ఆరుసార్లు పనిచేశారు. ఇక, అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం విక్రమసింఘే డియాతో మాట్లాడుతూ.. దేశంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మన ముందు పెద్ద సవాళ్లు ఉన్నాయని అన్నారు.  ప్రస్తుతం దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయనకే పార్లమెంటు సభ్యులు పట్టం కట్టారు.

పార్లమెంటులో మొత్తం 219 మంది ఎంపీలు ఉండగా, 134 మంది ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో 8వ లంక అధ్యక్షుడిగా రణిల్‌ ‌ను అవకాశం వరించింది.  ఆయనపై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమయి నప్పటికీ దేశాధ్యక్షుడిగా ఎంపీలు ఎన్నుకున్నారు. బుధవారం జరిగిన ఓటింగ్‌లో మొత్తం 225 సీట్లకుగానూ 223 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇద్దరు గైర్హాజరవ్వగా.. 4 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో చెల్లుబాటు అయిన 219 ఓట్లలో రణిల్‌ ‌విక్రమసింఘేకి మెజారిటీ దక్కింది. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు మార్గం సుగుమమైంది. గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయాక తాత్కాలిక ప్రెసిడెంట్‌గా  విక్రమసింఘే కొనసాగుతున్న విషయం తెలిసిందే. 6 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన విశేష అనుభవం రణిల్‌ ‌విక్రమసింఘేకి ఉంది. అయితే ఇటివల చోటుచేసుకున్న పరిణామాలతో రాజపక్సల భాగస్వామిగా ఆయనపై ముద్రపడింది. రాజపక్స కుటుంబ పార్టీ ఎస్‌ఎల్‌పీపీ మద్దతిస్తుండడంతో వారి ప్రయోజనాలను విక్రమసింఘే కాపాడుతున్నారని ఆందోళనకారులు విశ్వసిస్తు న్నారు. ప్రధాని పదవికి ఆయన కూడా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్‌ ‌చేసిన విషయం తెలిసిందే.

రాజపక్స కుటుంబ ప్రయోజనాలకు అనుగుణంగానే విక్రమసింఘే వ్యవహరిస్తున్నారని జనాలు నమ్ముతున్నారని, ఈ పరిణామం అధ్యక్ష ఎన్నికల్లో ప్రతికూలంగా మారుతుందని పరిశీలకులు అంచనా వేశారు. కానీ అలా జరగలేదు. గొటబాయ రాజపక్స ప్రాతినిధ్యం వహించే ఎస్‌ఎల్పీపీ పార్టీకి చెందిన ఎంపీలంతా రణిల్‌ ‌కే ఓటు వేశారు. ఆయన అధ్యక్ష పదవిలో 2024 నవంబరు వరకు కొనసాగనున్నారు. లంక పార్లమెంటు సభ్యులు తమ దేశాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోవడం 44 ఏళ్లలో ఇదే తొలిసారి. రణిల్‌ ‌విక్రమ సింఘేకు ఒక రాజకీయ పార్టీ ఉంది.

దానిపేరు యునైటెడ్‌ ‌నేషనల్‌ ‌పార్టీ (యూఎన్‌పీ)  శ్రీలంకలో 2020లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యూఎన్పీకి ఒక్క సీటు కూడా రాలేదు. అయితే, మొత్తం ఓట్ల ఆధారంగా ఆ పార్టీకి కేటాయించిన ఒక సీటుతో విక్రమ సింఘే పార్లమెంటుకు నామినేట్‌ అయ్యారు. ఇలా పార్లమెంటుకు నామినేట్‌ అయిన రణిల్‌.. ‌దేశ అధ్యక్ష స్థానానికి ఎంపికవడం విశేషం. రణిల్‌ ‌కు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది.రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టు, న్యాయవాదిగా పనిచేశారు. 1977లో సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా రణిల్‌  ‌పార్లమెంటు సభ్యుడు అయ్యారు. 1993లో తొలిసారి ప్రధాని అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *