వనస్థలిపురం ప్రజాతంత్ర 28 ఆగష్టు: బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీనివాస కాలనీలో నిలిపివేసిన మంచినీటి పైప్లైన్ పనులను వెంటనే ప్రారంభించాలని రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి మరియు బి యన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి, హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మనసురాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్,గడ్డన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ మహేశ్వర్ రెడ్డి జలమండలి ఆఫీస్ ఎదుట బైఠాయించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలో మంచినీటి పైప్ లైన్ ప్రారంభించే వరకు జలగండలి కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేస్తానని అధికారులతో చెప్పడంతో బుధవారం రోజున పనులు ప్రారంభిస్తామని జి.ఎ తెలియజేయడంతో నిరసన విరమించుకోవడం జరిగింది.




