శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: శేరిలింగంపల్లి నియోజక వర్గంలో భారీ మెజార్టీతో గెలిచి గులాబీ జెండా ఎగరవేస్తామని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సతీమణి శ్యామలాదేవి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ ప్రశాంత్ నగర్,రాఘవేంద్ర పాంచజన్య అపార్ట్మెంట్స్ ,కృషి నగర్ ,లక్ష్మీ నగర్, మందాడి అపార్ట్మెంట్స్ లలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సతీమణి సుమలత, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్యామల దేవి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బి ఆర్ ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళ పక్షపాతి అని మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినారని ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మీ షాది ముబారక్, ఒంటరి మహిళల కు పింఛన్లు,కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అని, అందరికి సన్న బియ్యం ,అసరా పెన్షన్ల పెంపు,దివ్యాంగుల పెన్షన్ పెంపు,400 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం మహిళలకు పెద్ద ఉపశమనం అని, ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి 15 లక్షల పెంపు చేయడం గొప్ప విషయం అని ,లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ, అర్హులైన పేద మహిళలదరికి ప్రతి నెల 3,000 రూపాయలు జీవన భృతి ని అందించడం గొప్ప విషయం అని ,రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేండ్ల కాలంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ఏం చేయబోతున్నామని పూర్తిగా వివరించారు. దళిత బంధు, రైతు బంధు కొనసాగించడం, మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్ పెంచడం, మైనార్టీలకు జూ.కాలేజీలను డిగ్రీ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయడం వంటి నిర్ణయాలు ప్రజలకుఎంతగానో ఉపయోగపడతాయని శ్యామల దేవి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ సహకారంతో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో 9 వేల కోట్ల రూపాయల నిధులతో శేరిలింగంపల్లి,నియోజకవర్గం ను అభివృద్ధి చేశారని, రాష్ట్రంలోని పేదలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు బాట అని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తొమ్మిది ఏండ్లలో చేసిన అభివృద్ధి ,సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు వేసి మళ్లీ గెలిపించాలని కోరుతున్నామని శ్యామల దేవి తెలియచేసారు .ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ కిరణ్, చంద్రిక ప్రసాద్, రోజా, సుప్రజ, బుచ్చిబాబు, పృథ్వి, రాధిక, ప్రణీత, కుమార్, యుగంధర్, రజిని, శ్యామల, సుప్రజ, కల్పన, సౌజన్య, సుబ్బారెడ్డి, రామారావు, రాకేష్, వెంకటేశ్వర్లు, పవన్, మహేశ్వర్,నాగరాజు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి లో భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తాం





