శేరిలింగంపల్లి నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీని ఆదరించండి. దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: శేరిలింగంపల్లి నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించి గెలిపించాలని దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు కోరారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ తలపెట్టిన గడపగడపకు  ప్రజాయాత్ర మంగళవారానికి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పాపి రెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప లో  సభను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొనగా శేర్లింగంపల్లి మాజీ శాసనసభ్యులు బిక్షపతి యాదవ్, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్స్, కంటెస్టెడ్ కార్పొరేటర్స్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మహిళా మోర్చా ,యువమోర్చా, వివిధ మోర్చా నాయకులు ఆయనతోపాటు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రఘునందన్ రావు  మాట్లాడుతూ రోజురోజుకు టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లితోందని ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని, మళ్లీ కొత్త పథకాలను అందిస్తామని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని తమ ఓటుతో తగిన రీతితో బుద్ధి చెప్తారని అన్నారు. యువకుడు ఉత్సాహవంతుడు ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండి ప్రజా పోరాటం చేస్తున్న రవికుమార్ యాదవ్ పార్టీ తగిన గుర్తింపునిస్తుందని అన్నారు .ఈసారి భారతీయ జనతా పార్టీ నుండి టికెట్ వచ్చిన అభ్యర్థిని   గెలిపించి అసెంబ్లీ పంపించినట్లయితే ప్రజా సమస్యలపై ఎనలేని పోరాటం చేస్తూ మీ మధ్యలో ఉంటాడు కావున అతని గెలిపించి మీ సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా తెలియజేశారు.10 సంవత్సరాలలో తొమ్మిది వేల కోటతో అభివృద్ధి చేశానని చెప్పుకునే స్థానిక ఎమ్మెల్యే సరైన రోడ్లు ఉన్నాయా?సైరైన విద్యాలయాలు ఉన్నాయా?, సరిగ్గా మంచినీరు అందుతుందా?, ప్రజల ఆరోగ్యానికి భద్రత ఉందా? అందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు అందాయా? నిరుద్యోగ భృతి సంగతేంటి? ఇలా చెప్పుకుంటూ పోతే నియోజకవర్గంలో కోకొల్లలు సమస్యలు పాదయాత్రలో తమ దృష్టికి వచ్చాయని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ అన్నారు. అంతేకాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆస్తులను కబ్జాలు చేసి,భూకబ్జాలకు పాల్పడుతూ అక్రమాస్తులు సంపాదిస్తున్నారని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ఏది ఏమైనా రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే మీ అందరి ఆశీర్వాదంతో ఎన్నికలలో విజయం సాధించి తమ దృష్టికి వచ్చిన సమస్యలపై వెంటనే దృష్టి సారీస్తామని  అక్రమార్కుల భరతం పట్టి ప్రజా రంజక పాలన అందిస్తామని తెలిపారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *