శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 3: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతుంది. ఈ మేరకు శుక్రవారం నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లికి చెందిన గోపనపల్లి ఆటో యూనియన్ సభ్యులు, బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆఫీస్ పెట్ డివిజన్ చెందిన  భవన నిర్మాణ కార్మిక సంఘ సభ్యులు హైదర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ సభ్యులు  హైదర్ నగర్ డివిజన్ ఏ  ఎస్ రాజు నగర్ లకు చెందినకాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ విప్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు వారిని టిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. బిఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని పునరుద్గాటించారు. రాష్ట్ర ప్రజానీకం ప్రతిపక్ష పార్టీలు ఎన్ని చెప్పినా బిఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ చేరిన వారిలో ఉన్నారు. శేరిలింగంపల్లిలో ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని బారీ మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *