శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: శేరిలింగంపల్లి నియోజకవర్గంకాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా వి జగదీశ్వర్ గౌడ్ ను ప్రకటించినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. ఈ మేరకు సోమవారం చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు దొంతి కార్తిక్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో  పార్టీలో చేరారు. వారిని జగదీశ్వర్ గౌడ్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలకు ఆకర్షితులైన పలువురు తనపై నమ్మకంతో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. పార్టీలో చేరిన వారిలో శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ మరియు లింగంపల్లి ముఖ్య నాయకులు దొంతి సత్యనారాయణ గౌడ్,రామచందర్ రెడ్డి,సాయి రెడ్డి,దీపక్ గౌడ్,నరేందర్ గౌడ్,శ్రీనివాస్ చారి,ఆనంద్ గౌడ్,సతీష్,మహేష్,శ్రీపాల్ గౌడ్,మహిళ నాయకులు సుధ రాణి ,రాధ గారు యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *