శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: జాతీయ సమైక్యత దినోత్సవం ను ఆదివారం మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ప్రభుత్వ గాంధీ ఆధ్వర్యంలో మియాపూర్ సి ఐ ప్రేమ్ కుమార్ , కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ ,దొడ్ల వెంకటేష్ గౌడ్ , నార్నె శ్రీనివాస రావు , పూజిత జగదీశ్వర్ గౌడ్ , మంజుల రఘునాథ్ రెడ్డి ,రోజాదేవి రంగరావు , మాజీ కార్పొరేటర్ సాయి బాబా లతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందని భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత బ్రిటిష్ పరిపాలనకు బాహ్యంగా రాజుల ఏలుబడిలో ఉన్న సంస్థానాలను భారత యూనియన్ లో కలిపే ప్రక్రియను నాటి భారత ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా హైదరాబాద్ సంస్థానం 17వ, సెప్టెంబర్ 1948 నాడు భారతదేశంలో అంతర్భాగమయింది అని తెలిపారు. 1948 సెప్టెంబర్17న తెలంగాణలో రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పరిపాలనా దశకు పరివర్తన చెందిన రోజు.సువిశాల భారత దేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజని ఈ సందర్భంగా భారతీయులమని గర్విద్దాం..జాతి సమగ్రతను కాపాడుదాం, జాతి నిర్మాతల త్యాగాలను స్మరించుకుందాం అని పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై వివిధ సందర్భాల్లో అనేక పోరాటాలు జరిగాయని, న్యాయంకోసం, ధర్మం కోసం, రాజ్యాంగ హక్కుల సాధన కోసం ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి, గుండెలు ఎదురొడ్డి నిలిచింది తెలంగాణ సమాజం అని తెలిపారు. మన సమైక్యతే మనకు బలం. ఈ జాతీయ సమైక్యతా దినోత్సవ వేళ బంగారు తెలంగాణ సాధనకు ఒక్కటిగా కృషి చేద్దాం. తెలంగాణ ప్రగతిని ఇదేవిధంగా కొనసాగిద్దాం అని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు,ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ ప్రతినిధులు,ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు,మహిళలు ,అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



