చెన్నై, ఫిబ్రవరి 15 : మహాశివరాత్రి సందర్భంగా తిరువణ్ణామలై, కాళహస్తి క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తమిళనాడు ప్రభుత్వ రవాణా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 18వ తేది మహాశివరాత్రి సందర్భంగా తిరువణ్ణామలై, శ్రీకాళహస్తి ఆలయాలకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు వెళుతుంటారు.
భక్తుల సౌకర్యార్ధం మాధవరం బస్ టెర్మినల్ నుంచి విల్లుపురం ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్రం శ్రీకాళహస్తికి 17వ తేది సాయంత్రం నుంచి ప్రత్యేక బస్సులు నడుపనుంది. అలాగే, కోయంబేడు, తాంబరం, కాంచీపురం, తిరువళ్లూర్, విల్లుపురం, కళ్లకుర్చి, పుదుచ్చేరి తదితర ప్రాంతాల నుంచి కూడా శని, ఆదివారాల్లో ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.



