పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5:పటాన్ చెరు డివిజన్ పరిధిలో మౌలిక వసతుల కోసం కల్పనకు ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయిస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. డివిజన్ పరిధిలోని భాష్యం స్కూల్ సమీపంలో 42 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న యుజిడి పనులు, కుమ్మరి బస్తీలో 16 లక్షల రూపాయలతో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ జెడ్పిటిసి మాణిక్యం, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



