వ్యక్తిగత సమాచార గోప్యత బిల్లుకు మోక్షం లభించేనా ?

భారతదేశం  దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న డేటా రక్షణ చట్టం యొక్క పునర్నిర్మించిన సంస్కరణ క్యాబినెట్ చే ఆమోదించబడింది.  వర్షాకాల సమావేశాలలో పార్లమెంటు ముందుకు రావచ్చు.  గోప్యత ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొన్న దాదాపు ఆరేళ్ల తర్వాత, డేటా రక్షణ కోసం చట్టం రూపొందించడంలో కేంద్రం రెండో ప్రయత్నం చేసింది.నవంబర్‌లో రూపొందించిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, 2022, జూలై 20న ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ముసాయిదాను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. కేంద్ర కేబినెట్ గత వారం ముసాయిదా బిల్లును ఆమోదించింది.బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే వరకు అందులోని అంశాలు గోప్యంగానే ఉంటాయి.
 స్మార్ట్‌ఫోన్, సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌ లేకుండా జీవితం నడవని పరిస్థితుల్లో,  వ్యక్తిగత సమాచార గోప్యత ఓ దేవతా వస్త్రం. సాంకేతికత సాయంతో ఎవరి డేటా అయినా ఇట్టే చేజిక్కించుకోవచ్చన్నది పదే పదే బయటపడ్డ పచ్చి నిజం. ఈ రోజు, డేటా మీ గుర్తింపు. మీ డేటాను రక్షించడం అంటే మీ గుర్తింపును కాపాడుకోవడం. వర్షాకాల సెషన్‌లో మీ డేటా, మీరు దాన్ని ఎలా సురక్షితంగా ఉంచుకోవచ్చనే దాని గురించి మాట్లాడే బిల్లు చర్చకు వస్తుంది. .డేటా బిల్లు సమ్మతి వయస్సును తగ్గించడానికి ప్రభుత్వానికి అధికారం ఇవ్వవచ్చు. ప్రతిపాదిత చట్టం ప్రకారం సమ్మతి కోసం వయస్సును తగ్గించడం అనేది ఫేస్బుక్ గూగుల్ వంటి ఇంటర్నెట్ కంపెనీల అతిపెద్ద డిమాండ్లలో ఒకటి, ఇది దేశంలో వారి వ్యాపార కార్యకలాపాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. దేశంలోని పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి పరిరక్షించడమే లక్ష్యంగా వ్యక్తిగత సమాచార పరిరక్షణ(పీడీపీ) బిల్లును కేంద్రం 2018లో తెరపైకి తెచ్చింది.  నాలుగేళ్ళ సుదీర్ఘ కాలం తరువాత  వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు ను కేంద్రం ఉపసంహరించుకుంది. సవరణలతో మళ్లీ ప్రవేశ పెట్టాలని గత వారం  నిర్ణయించుకుంది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లుకు 81 సవరణలు ప్రతిపాదించడంతో కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ గోప్యత బిల్లు ఉపసంహరించుకుంది. 2019 డిసెంబర్‌ 11న ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన అనంతరం 2019 డిసెంబర్‌లో ఈ బిల్లుకు కేంద్రం రూపకల్పన చేసింది. ప్రజల సమాచార గోప్యతా చట్టానికి సంబంధించిన ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని  విపక్షాలు ఆరోపించాయి. వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం కల్పించేలా గతంలో చట్టం జాతీయ భద్రత, ఇతర కారణాల పేరుతో వ్యక్తుల వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయడానికి ఈ చట్టం ప్రభుత్వానికి విస్తృత అధికారాలు కల్పిస్తున్నదని విమర్శించాయి.  కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘా ఏజెన్సీలకు ఈ చట్టం నుంచి పలు మినహాయింపులు ఇచ్చింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి గోపత్య కల్పించడం, ఓ ప్రాధికార సంస్థ ద్వారా రక్షణ కల్పించడం ఈ బిల్లు ఉద్దేశం. జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నా అంశాలు, జాతీయ భద్రత, శాంతిభద్రతలు, దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తమ దర్యాప్తు సంస్థలకు ఈ చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వొచ్చు.  2019 డిసెంబర్ లో  ఇది సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ముందుకు వెళ్ళింది. ఆ కమిటీ వివిధ రంగాల నిపుణులు, భాగస్వామ్య సంస్థలతో చర్చించి బిల్లులో అనేక మార్పుచేర్పులు చేసింది. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లోనైనా బిల్లు చట్టరూపం దాలుస్తుందా? అనేది అనుమానమే!  గత ఐదు సంవత్సరాలుగా వ్యక్తిగత సమాచార గోప్యత కు సంబంధించి దేశంలో  చర్చోప చర్చలు జరుగుతూనే ఉన్నాయి. జస్టిస్ బి ఎన్ శ్రీకృష్ణ  నేతృత్వంలో రూపొందించిన  డేటా ప్రొటెక్షన్ బిల్లుని 2019 లో పార్లమెంటులో  ప్రవేశపెట్టి దీనికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేశారు. దాదాపు రెండు సంవత్సరాల తరువాత కమిటీ తుది నివేదిక ఇవ్వడం జరిగింది. పౌరుల వ్యక్తిగత గోప్యతకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన ‘పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు–2019 (పీడీపీ)’ ముసాయిదాకు పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ)  ఆమోదం తెలిపింది.  కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘా ఏజెన్సీలకు ఈ చట్టం నుంచి పలు మినహాయింపులు ఇచ్చింది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గోపత్య కల్పించడం, ఓ ప్రాధికార సంస్థ ద్వారా రక్షణ కల్పించడం ఈ బిల్లు ఉద్దేశం. జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నా అంశాలు, జాతీయ భద్రత, శాంతిభద్రతలు, దేశ సార్వభౌమత్వం, సమగ్రత కు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తమ దర్యాప్తు సంస్థలకు ఈ చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వొచ్చు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆనాడు ఈ బిల్లును జేపీసీ పరిశీలనకు నివేదించారు. కేంద్ర ప్రభుత్వం రాబోవు  పార్లమెంటు సెషన్లో  ప్రవేశపెట్టనున్న వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు తీవ్రమైన ప్రతిఘటనకు దారితీస్తున్నది . ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధల సమాచార గోప్యత విషయంలో కేంద్రం చూపుతున్న వివక్షే కారణం. ఈ బిల్లు చట్టంగా మారితే కేంద్రం ప్రభుత్వానికి వ్యక్తిగత సమాచార రక్షణ విషయంలో విశేషాధికారులు దఖలు పడనున్నాయి. ఇది అంతిమంగా నియంతృత్వానికి దారి తీసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్న విపక్షాలు కేంద్రానికి అసమ్మతి నోట్ పంపాయి.  దేశంలో పౌరులు, వ్యక్తులు, సంస్ధలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే విషయంలో ఆందోళనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా పెగాసస్ వంటి స్పైవేర్ లను వాడటం ద్వారా కేంద్రం ఇలాంటి వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తుతుండటం, దీనిపై సుప్రీంకోర్టు సైతం నిపుణుల కమిటీతో విచారణ చేయిస్తున్న తరుణంలో పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడం కేంద్రానికి సవాళ్లు విసురుతోంది. దీంతో కేంద్రం వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లును తెచ్చేందుకు సిద్దమవుతోంది. అయితే ఇందులో పొందుపరిచిన అంశాలు వివాదాస్పదంగా మారుతున్నాయి.
ప్రజల వ్యక్తిగత సమాచారం పై ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉండేట్లు బిల్లు ఉందని విపక్షాల వాదన
 కేంద్ర ప్రభుత్వం పౌరుల, సంస్ధల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే పేరుతో తీసుకొస్తున్న బిల్లులో అంశాలపై విపక్షాలు ముందే పెదవి విరుస్తున్నాయి. ఈ బిల్లు వల్ల పౌరుల, సంస్ధల వ్యక్తిగత సమాచారం రక్షణ సంగతేమో కానీ కేంద్రానికి మాత్రం వారిపై పెత్తనం చెలాయించే విశేషాధికారాలు దఖలు పడటం ఖాయమంటున్నారు. ఈ బిల్లులో పొందుపరిచిన పలు అంశాలపై విపక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు యథాతథంగా పార్లమెంటులో ఆమోదం పొందితే కేంద్రం తమకు కావాల్సిన వారి డేటాను మాత్రమే రక్షించే వీలుంటుందని, మిగతా డేటా కేంద్రం చేతుల్లోకి వస్తుంది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా ఏ ఏజెన్సీని అయినా మొత్తం చట్టం నుంచి మినహాయించేలా కేంద్ర ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలను ఇది ఇవ్వడాన్ని అలాగే  సెక్షన్ 35 పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  వ్యక్తిగత సమాచారం ఇచ్చేందుకు సమ్మతించే నిబంధనల నుంచి ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు కొన్ని మినహాయింపులు ఇవ్వడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఈ బిల్లును ప్రస్తుత రూపంలో పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు బిల్లులోని సెక్షన్ 12 , 35 ప్రకారం ప్రభుత్వానికి, దాని సంస్థలకు అందించే విస్తృత మినహాయింపులపై జెపిసి కమిటీ  అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆధునిక నిఘా నెట్‌వర్క్‌ను ఏర్పాటు, ఇలా పెట్టే నిఘాతో ఉత్పన్నమయ్యే హానిపై కేంద్రం దృష్టిసారించకపోవడం,  ఈ బిల్లులో అంశాలపై పార్లమెంటరీ పర్యవేక్షణ లేకపోవడం; ఫ్రేమ్‌వర్క్ కింద వ్యక్తిగతేతర డేటా నియంత్రణ, జరిమానాల లెక్కింపులో వైఫల్యంపై ఎక్కడ ప్రస్తావించలేదని జెపిసి తెలిపింది. ఈ  బిల్లులో లోపాలు ఉన్నాయి  పార్లమెంటులో చర్చకు పెట్టాలని పార్లమెంటరీ కమిటీ తీర్మానించింది. ఇప్పటికే వాట్సాప్,  ఫేస్‌బుక్‌తో యూజర్ల డేటాను షేరింగ్ చేయడం భారత రాజ్యాంగం ప్రకారం ప్రైవసీ ఉల్లంఘన అవుతుందనే ఆందోళనల నేపథ్యంలో తాత్కాలికంగా ఈ ప్రైవసీ పాలసీ నిలిపివేస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.  డేటా ప్రొటెక్షన్ బిల్లు  అమల్లోకి వచ్చేంత వరకు తమ ప్రైవసీ పాలసీ తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వాట్సాప్ యూజర్లు కూడా ఈ పాలసీని అంగీకరించాలని ఇకపై ఒత్తిడి చేయబోమని స్పష్టం చేసింది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు ను కేంద్రం  సవరణలతో మళ్లీ ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకుంది.

– డాక్టర్. ఎం. సురేష్ బాబు,
అధ్యక్షులు, ప్రజా సైన్సు వేదిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *