వైభవంగా నాగుల పంచమి 

చిన్నకోడూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 21:   మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో  నాగుల పంచమిని పురస్కరించుకుని గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుండే ఆలయానికి భక్తుల తాకిడి మొదలైంది. మహిళలు  భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి పసుపు, కుంకుమతో కొబ్బరికాయ కొట్టి ధూప దీప నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కోర్కెలు తీర్చు నాగదేవత అని వేడుకున్నారు. భక్తుల తాకిడితో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *