హాస్పిటల్‌ల్లో 4 లైనాక్ మెషీన్ల ఏర్పాటుకు నిర్ణయం
వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో 12రకాల రాపిడ్ డయాగ్నోస్టిక్స్ కిట్లు
ఉన్నతస్థాయి సక్షలో అధికారులను ఆదేశించిన సిఎం జగన్
అమరావతి,సెప్టెంబర్13 : క్యాన్సర్ నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులకు సిఎం జగన్ సూచించారు. రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు సహా కొత్తగా నిర్మించే వైద్య కళాశాలల్లో క్యాన్సర్ విభాగాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్యశాఖపై సక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ, అనంతపురం, కాకినాడ, గుంటూరు ఆస్పత్రుల్లో 4 లైనాక్ మెషీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది. శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలు ఆస్పత్రుల్లో బంకర్ల నిర్మాణానికి, మరో 7 పాత మెడికల్ కాలేజీల్లో కేన్సర్ శస్త్ర చికిత్సలు కోసం ఆపరేషన్ ధియేటర్ల అప్‌గ్రడేషన్‌కు సీఎం ఆమోదం తెలిపారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ లో 12 రకాల రాపిడ్ డయాగ్నోస్టిక్స్ కిట్లు,67 రకాల మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రక్తహీనత నివారణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, రక్తహీనత అధికంగా ఉన్న ప్రాంతాల్లో అదనంగా పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ సదంర్భంగా సిఎం మాట్లాడుతూ.. కొత్తగా నిర్మించనున్న మెడికల్ కాలేజీల్లోనూ అత్యాధునిక క్యాన్సర్ విభాగాల ఏర్పాటు చేయాలన్నారు.
అలాటే ప్రతి మెడికల్ కాలేజీలో ప్రత్యేక విభాగాల ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఉన్న క్యాన్సర్ విభాగాలను బలోపేతం చేయాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం పర్యవేక్షణకు జిల్లాల్లో ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. ఏడాదిలోగా రక్తహీనత సమస్యను నివారించాలని సీఎం అన్నారు. ఈ సక్షలో ఈ సక్షలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ.కృష్ణబాబు, ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జి ఎస్ నవీన్ కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్ హరీందప్రసాద్, ఏపీవీవీపీ కమిషనర్ వినోద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సక్షలో పాల్గొన్నారు.




