ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్ 16 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎమెల్యే అభ్యర్థిత్వానికి లోటస్ పాండ్ పార్టీ కార్యాయంలో పార్టీ ముఖ్యనేతలకు ధరఖాస్తును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యవర్గం సభ్యులు తాళ్ళ అఖిలేష్ గౌడ్ అందజేశాడు.ఈ సందర్బంగా తాళ్ళ అఖిలేష్ గౌడ్ మాట్లాడుతూ,పార్టీ అధ్యక్షురాలు షర్మిల ధరఖాస్తు పరిగణలోకి తీసుకొని టికెట్ ఇస్తే అత్యదిక మెజారిటీతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఎగరెస్థామని అన్నారు.ఇబ్రహీంపట్నం కైవసం చేసుకొని షర్మిలను తెలంగాణ ముఖ్యమంత్రి చేసుకుంటామని తాళ్ళ అఖిలేష్ గౌడ్ అన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కో-ఆర్డినేటర్ మహేశ్వరం నియోజకవర్గం ఎమెల్యే అభ్యర్థి గుర్జని సుమన్ గౌడ్,ఎల్.బి నగర్ వైఎస్ఆర్ టీపీ నాయకులు శంకర్, యువజన విభాగం నాయకులు బొమ్మనమోని పవన్ ముదిరాజ్,సిద్దు గౌడ్, రాఘవేందర్ ముదిరాజ్,సందీప్, శరత్,తదితరులు పాల్గొన్నారు.