మహేశ్వరం, ప్రజాతంత్ర సెప్టెంబర్ 2: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, దివంగత మహానేత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్మరణీయుడని, యావత్ తెలుగు ప్రజలు ఉన్నంత వరకు వారి గుండెలోనే కొలువై ఉంటారని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి కొనియాడారు. వైఎస్ఆర్ 14వ వర్ధంతిని పురస్కరించుకొని.. మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి అధ్వర్యంలో బిఏంసి పాత గ్రామ పంచాయితీ, అల్మాస్ గూడ వైఎస్ఆర్ పార్కు దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి పాల్గొని, టిపిసిసి కార్యదర్శి ఎలిమెటి అమరేందర్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, సీనియర్ నాయకులతో కలిసి వైఎస్ఆర్ చిత్రా పటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు దేశంలో మొదటి సారి ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా ఒకే సారి పూర్తిగా రుణమాఫి చేసిన ఘనత వైఎస్ఆర్ కే దక్కుతుందని కొనియాడారు. ఫీజ్ రియంబర్స్ మెంట్ పథకాన్ని తీసుకువచ్చి లక్షలాది పేద, మధ్య తరగతి విద్యార్థుల జీవితాలలో విద్యా వెలుగులు నింపిన గొప్ప దార్శనికుడని అన్నారు. ఆరోగ్య శ్రీ పథకం తీసుకు వచ్చి, కోట్లాది మందికి ప్రాణం పోసిన మహనీయుడు వైఎస్ఆర్ అని అన్నారు. ఈ చెప్పుకుంటూ పోతే అయన పాలన ఒక స్వర్ణ యుగామని కొనియాడారు. అలాంటి నేతను కోల్పోవడం యావత్ తెలుగు ప్రజలు చేసుకున్న దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వంకటి ప్రభాకర్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, సీనియర్ నాయకులు నవారు మల్లారెడ్డి, బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, శ్రీదర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




