చిన్నకోడూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 18: చిన్నకోడూరు మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం వారు మాట్లాడుతూ….వెన్నుచూపని వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అన్నారు. గోల్కొండ కోటపై మొగలాయిల పెత్తనాన్ని ధిక్కరించిన ధైర్యశాలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం నేటి యువతకు స్ఫూర్తి దాయకం అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు.



