వృత్తి కళాకారులకు ప్రోత్సాహం

విశ్వకర్మ కౌశల్‌ ‌సమ్మాన్‌ ‌ప్యాకేజీ పథకం
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌  ‌కేంద్ర బడ్జెట్‌లో ప్రధాన మంత్రి విశ్వకర్మ కౌశల్‌ ‌సమ్మాన్‌ ‌ప్యాకేజీ పథకాన్ని ప్రకటించారు. సంప్రదాయ వృత్తులు, చేతి వృత్తులవారికి సహాయపడటానికి ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. వీరు తమ ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచుకోవడానికి, మరింత విస్తరించడానికి, జనబాహుళ్యానికి తమ ఉత్పత్తులను మరింత చేరువ చేయడానికి ఈ పథకం దోహదపడుతుంది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల రంగానికి అనుసంధానంగా ఈ పథకాన్ని ప్రతిపాదించినట్లు నిర్మల తెలిపారు. కృత్రిమ మేధాశక్తిని దేశం కోసం ఉపయోగించుకోవడం కోసం 3 కృత్రిమ మేధాశక్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *