ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 03 : కార్గిల్ యుద్ధ సమయంలో దేశ పౌరుల భద్రత కోసం ధైర్యంగా పోరాడిన వీర జవాన్లను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ విజయోత్సవ దినోత్సవం సందర్భంగా అలియాబాద్ లోని శారద విద్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్యఅతిథిగా ప్రసంగించి విచ్చేసి ప్రసంగించారు. తెలంగాణ సిటిజన్స్ కౌన్సిలు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్ శాలిబండ పోస్ట్ ఆఫీస్ నుండి ప్రారంభించిన ర్యాలీని జెండా ఊపి వీర జవాన్ల త్యాగాలను దేశభక్తి నినాదాలతో విద్యార్థులు సంఘ సేవకులు జాతీయ జెండాను చేతపట్టి ఫుల్ బాగ్ చమన్ శారద విద్యాలయం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. విద్యావేత్త వి.ప్రభాకర్ రావు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నగర కన్వీనర్ కోటి ధర్మతేజ, పూల్ బాగ్ చమన్ వెంకటేశ్వరస్వామి మహాదేవ స్థానం చైర్మన్ బి.లెనిన్ బాబు, బి.సీమ శారద పాఠశాల ప్రిన్సిపల్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి.పద్మావతి, డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ కుమారి లలితా సాంబ, పాతబస్తీ టిసిసి అధ్యక్షులు ఎస్ఆర్ కే శాస్త్రి, ప్రోగ్రాం కన్వీనర్ జె.విజ్ఞాత, రాజేందర్ ముదిరాజ్, కే.శ్యామ్ రావు, కోఆర్డినేటర్ ఢిల్లీ శివకుమార్, ఠాకూర్ గణేష్ సింగ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. 50 ఏళ్లుగా తెలంగాణ ఆర్మీ బెటాలియన్ లో సేవలందించిన ఎన్సిసి ఆఫీసర్ మేజర్ ఎస్ఏ.శివప్రసాద్ ను జస్టిస్ చంద్రకుమార్ సన్మానించారు.



