విషమంగానే ప్రీతి ఆరోగ్య పరిస్థితి

  • ఎక్మో సపోర్ట్‌తో వెంటిలేటర్‌పై చికిత్స
  • హెల్త్ ‌బులిటెన్‌ ‌విడుదల చేసిన నిమ్స్
  • ‌ప్రీతిని బతికించేందుకు వైద్యుల కృషి….రాజకీయ రంగు పులమొద్దు : బిఎస్‌పి  ప్రవీణ్‌ ‌కుమార్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : వరంగల్‌ ‌కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్‌ ‌ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.ఈ మేరకు ప్రీతి హెల్త్ ‌బులిటెన్‌ను నిమ్స్ ‌హాస్పిటల్‌  ‌వైద్యులు  విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా నే ఉందని వైద్యులు తెలిపారు. నాలుగు రోజులుగా ప్రీతికి చికిత్స జరుగుతుంది. అయినా ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఇంకా ఎక్మో సపోర్ట్‌తో వెంటిలేటర్‌పై ఉంచి ప్రీతికి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రీతిని కాపాడేందుకు తీవ్రంగా యత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ మేరకు డీఎంహెచ్‌వోకు వైద్యుల బృందం నివేదికను అందజేసింది.

ప్రీతి ఆత్మహత్యాయత్నంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ‌కేసు నమోదు చేసింది. కాగా..ప్రీతిని రక్షించేందుకు నిమ్స్ ‌వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. న్యూరాలజీ, జనరల్‌ ‌ఫిజీషియన్‌, ‌కార్డియాజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది. ప్రీతి మత్తు ఇంజెక్షన్‌ ‌తీసుకుంది. దీని ప్రభావం శరీరంలోని భాగాలపై విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా బ్రెయిన్‌ ‌పై మత్తు ఇంజెక్షెన్‌ ‌ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రీతికి మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ ‌నుంచి హైదరాబాద్‌  ‌నిమ్స్ ‌హాస్పిటల్‌కి తరలిస్తున్న సమయంలో దాదాపు మూడు సార్లు ప్రీతి గుండె ఆగిపోయింది. వెంటనే సీపీఆర్‌  ‌చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా వైద్యులు చేశారు. నిమ్స్‌కు చేరుకున్న అనంతరం ప్రీతికి పూర్తిగా వెంటీలేటర్‌, ఎక్మోపైనే చికిత్స కొనసాగుతుంది.

ప్రీతిని బతికించేందుకు వైద్యుల కృషి….రాజకీయ రంగు పులమొద్దు : బిఎస్‌పి  ప్రవీణ్‌ ‌కుమార్‌
‌హైదరాబాద్‌,‌ఫిబ్రవరి25(ఆర్‌ఎన్‌ఎ): ‌పీజీ స్థాయిలోనే కాదు ప్రగతి భవన్‌ ‌లోనూ ర్యాగింగ్‌ ఉం‌దని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ అన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని  ప్రీతి కుటుంబ సభ్యులను ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌పరామర్శించారు. పీజీ స్థాయిలోనే కాదు ప్రగతి భవన్‌ ‌లోనూ  కనిపించని ర్యాగింగ్‌, ‌బెదిరింపులు ఉన్నాయని ఆరోపించారు. పేదవర్గం నుంచి వచ్చిన ప్రీతి చాలా కష్టపడి చదివిందన్నారు. పేద వర్గాలపై అన్యాయంగా దాడులు చేస్తున్నారని..  బలహీన వర్గానికి చెందిన వాళ్లు డాక్టర్స్  ‌కాకుడదా అని ప్రశ్నించారు. ప్రీతి ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కొందరు రాజకీయ రంగు పులముతున్నారని.. ఇది లహ్‌ ‌జిహాద్‌ అని అనడం కరెక్ట్ ‌కాదన్నారు. ప్రీతికి నిమ్స్‌లో వైద్యం అందుతోందని, అయితే ఇంకా ఎవరైనా నిపుణులు ఉంటే పిలపించి చూపించాలని అన్నారు. ఆమెను కోలుకునేలా చేసేందుకు డాక్టర్లు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇంకా ఏమైనా అధునాతన వైద్య సేవలు అవసరమో గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *