విశ్వరూపం మహా సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 4: విశ్వరూప మహా మహా సభకు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మహేశ్వరం నియోజకవర్గం కో ఇంఛార్జి బోర్ర రవి మాదిగ పిలుపు నిచ్చారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు.. ఈ నెల 11న తలపెట్టిన విశ్వరూప మహా సభ గోడ పత్రికను బాలాపూర్ కమిటి అధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవి మాదిగ మాట్లాడుతూ..ఈ నెల 11న తలపెట్టిన విశ్వరూప మహా సభను విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గం లేమూర్ గ్రామంలో ఈ నెల 6న నిర్వహించనున్న  ఏం అర్ పి ఎస్, ఎం ఆర్ ఎం ఎస్ పి కార్యకర్తల సమావేశానికి మంద కృష్ణ మాదిగ రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మాదిగ దండోరా మహాజన సోషల్ మీడియా ఇంఛార్జి ముచ్చర్ల ఆనంద్ మాదిగ, బాలాపూర్ మండల అధ్యక్షులు పుట్ట గళ్ళ రాము మాదిగ, బాలాపూర్ మండల ఇంఛార్జి తొట్ల శ్రీనివాస్ మాదిగ, బాలాపూర్ మండల అధికార ప్రతినిధి వంక ఉపేందర్ మాదిగ, బాలాపూర్ మండల ఉపాధ్యక్షులు చింతుల చిన్న మాదిగ, బాలాపూర్ మండల కార్యకర్తలు అంజయ్య మాదిగ, రాము మాదిగ, ఆటో యూనియన్ నాయకులు రంగారెడ్డి సాకలి నరసింహ, కుమ్మరి యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *