- నేటి ఉదయం ప్రారంభించనున్న సిఎం జగన్
- భారీగా ఏర్పాట్లు చేసిన ఎపి ప్రభుత్వం
- 2లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్శించడమే లక్ష్యం
- ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
విశాఖపట్టణం,మార్చి2: పెట్టుబడులే లక్ష్యంగా విశాఖ వేదికగా నేటినుంచి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరుగనుంది. ఇందుకోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం వేదికగా నిర్వహించబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా రూ.2లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, తద్వారా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం తరపున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ శుక్రవారం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సదస్సుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి. సదస్సు ప్రాంగణం అంతా సెక్యురిటీ లైజన్ లోకి వెళ్లిపోతుంది. ఇప్పటికే 14వేల రిజిస్టేష్రన్లు నమోదయ్యాయి. రేపు వచ్చే డెలిగేట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఒకరోజు ముందుగానే రిజిస్టేష్రన్లు మొదలు పెట్టడం జరిగిందని మంత్రి అన్నారు.
సీఎం జగన్ సాయంత్రం విశాఖకు చేరుకుంటారు. ఆ తర్వాత సీఎం శుక్రవారం జరగబోయే సదస్సుకు సంబంధించి అధికారులతో సక్ష నిర్వహిస్తారు. శుక్రవారం10.15 గంటలకు సీఎం జగన్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సును లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్స్, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రానున్నారు. రాబోయే ప్రముఖుల అందరి సమక్షంలో ఇనాగురల్ సెషన్ రేపు 2 గంటల ఉంటుంది. అదేవిధంగా రేపు కొన్ని ఎంవోయూలు చేయడానికి నిర్ణయించకున్నాం. ఇక్కడ ఏర్పాటు చేసిన 150 పై చిలుకు స్టాల్స్ కు సంబంధించిన ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తోపాటుగా, సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఎంపిక చేసిన 14 కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణ కార్యక్రమం ఉంటుంది.
ఇందుకు సంబంధించి సెక్టరల్ సెషన్స్ కూడా జరగనున్నాయి. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తలతో సీఎం జగన్ వారితో బ్యాక్ టూ బ్యాక్ టింగ్ లో పాల్గొంటారని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. సీఎం జగన్ అంటే క్రెడిబిలిటీ అని..వారి నాయకత్వం పెట్టుబడిదారులకు సహకరిస్తుంది అనే నమ్మకాన్ని రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలకి కల్పించామన్నారు. రేపు కూడా అదే నమ్మకాన్ని గ్లోబల్ పారిశ్రామిక వేత్తలకు కల్పించనున్నామని తెలిపారు. రాష్ట్ర ఎకానని అభివృద్ధి చేయడం, అంతేకాకుండా యువతకు ఉపాధి కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని వివరించారు. 46 దేశాల ప్రముఖులు వచ్చేస్తున్నారు. 8 నుంచి 10 మంది అంబాసిడర్స్ కూడా వస్తున్నారని.. వారికి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందరికీ విందు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. డెలిగేట్స్ కు ఆంధ్రా రుచులను పరిచయం చేయబోతున్నామని వెల్లడించారు.




