విశాఖలో రెండో నంబర్‌ ‌హెచ్చరిక

విశాఖపట్టణం, డిసెంబర్‌ 9 : ‌మాండస్‌ ‌తీవ్ర తుఫాను  క్రమంగా బలహీనపడి తుఫాన్‌గా కొనసాగుతోంది. రాత్రి లేదా శనివారం తెల్లవారుజామున దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాల్ని తాకుతూ మహాబలిపురం సపంలో తుఫాన్‌ ‌తీరం దాటే అవకాశం ఉంది. ఆ తరువాత తుఫాను క్రమంగా బలహీన పడనుంది. ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోటర్ల దూరంలో తుఫాన్‌ ‌కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 65 నుంచి 75 కొన్ని సార్లు 85 కిలోటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

తీరం దాటే సమయంలో పూరిల్లు చెట్లు కూలడంతో పాటు… కొన్ని ప్రాంతాలు ముంపు గురికానున్నాయి. తుఫాను నేపథ్యంలో చెన్నై కృష్ణపట్నం పోర్టులకు మూడో నెంబర్‌ ‌హెచ్చరిక కొనసాగుతోంది. అలాగే విశాఖపట్నం పోర్టుకు రెండో నెంబర్‌ ‌హెచ్చరికను జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మిగతా ప్రాంతాల్లో చెదురు మాదిరిగా వర్షాలు పడనుండగా… ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *