విరు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు

  • జనమే ఇంటికి పంపిస్తారు
  • రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడే వారా నీతులు చెప్పేది

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని బిఆర్‌ఎస్‌ ‌బహిష్కరించడంపై కేంద్ర మంత్రి కిష•న్‌ ‌రెడ్డి ఆగ్రహం
న్యూ దిల్లీ, జనవరి 31 : వి•రు రాజీనామాలు చేయాల్సిన అవసరంలేదు..వొచ్చే ఎన్నికల్లో జనమే మిమ్ములను ఇంటికి పంపిస్తారని బీఆర్‌ఎస్‌ ‌నేతల తీరుపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. ప్రధానికి, రాష్ట్రపతికి, గవర్నర్‌కు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వని నిరంకుశ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. రానున్న ఐదారు నెలల కోసం పదేపదే రాజీనామాలు చేస్తామని బెదరించడంలో అర్థం లేదని కిషన్‌ ‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌గెలిచినప్పటి నుంచి ఒక్క రోజు కూడా శాసనససభలో అడుగుపెట్టకుండా చేశారని..అంతేకాకుండా, అసెంబ్లీ సెషన్‌ ‌మొత్తం సస్పెండ్‌ ‌చేసి సభకు రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. అంత గొప్ప మహానుభావులు మాకు రాజకీయాల గురించి, హక్కుల గురించి నీతులు చెబుతున్నారని ఎద్దేవ చేశారు. ఇప్పుడేమో ఆ పార్టీ నేతలు రాజీనామా చేస్తామని అంటున్నారు.

విరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. మేం కోరుకోవడం లేదు.. కొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో జనమే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని స్పష్టం చేశారు.  రాష్ట్రపతి  ప్రసంగాన్ని బాయ్‌ ‌కాట్‌ ‌చేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎం‌పీలకు కేసీఆర్‌ ‌చెప్పడంపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ ‌రాజ్యాంగానికి ఇచ్చే గౌరవానికి ఇదే నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కేసీఆర్‌ ‌రాజ్యాంగాన్ని పదే పదే అవమానిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే, ఎంపీలను మాత్రమే కాకుండా గవర్నర్లు, ప్రధాని, రాష్ట్రపతిని కేసీఆర్‌ ‌గౌరవించకపోవడం సిగ్గుచేటన్నారు. ఉపఎన్నికల్లో గెలిచిన ఈటలను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా చేసిన బీఆర్‌ఎస్‌..‌తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌ ‌నేతలు రాజీనామా చేస్తామనడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *