హనోరు (వియత్నాం), సెప్టెంబర్ 14 ః వియత్నాంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రాజధాని హనోరులో 9అంతస్తుల భవనంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో 56మంది మరణించారు. వీరిలో నలుగురు చిన్నారులు వున్నారు. మరో 37మంది గాయపడ్డారని ప్రభుత్వ డియా తెలిపింది. మృతి చెందిన వారిలో 39మందిని గుర్తించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ వియత్నాం న్యూస్ తెలిపింది.
గాయపడిన వారిని, మరణించిన వారిని వేర్వేరు ఆస్పత్రులకు తీసుకెళ్లడంతో మృతుల సంఖ్య స్పష్టం కాలేదు. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. ఆ భవనానికి ఎమర్జన్సీ మార్గం లేదు. దాంతో ఆ భవనంలో చిక్కుకున్నవారు బయటపడడం చాలా కష్టమైంది.




