లండన్,సెప్టెంబర్ 13 : విమానం వాష్‌రూంలో శృంగారంలో మునిగితే లుతూ పట్టుబడిన జంటను విమా నం నుంచి సిబ్బంది దించి వేసిన ఘటన కలకలం రేపింది. బ్రిటన్ లోని లుటన్ నుంచి స్పెయిన్‌కు వెళుతున్న ఈజీజెట్ విమానంలో ఈ ఘటన చోటుచేసు కుంది. జంట శృంగారంలో పాల్గొంటుండగా ఫ్లైట్ అటెండెంట్ కంటపడటంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. సెప్టెం బర్ 8న జరిగిన ఈ ఘటనకు సంబంధించి 37 సెకండ్ల నిడివి కలిగిన వీడియో ట్విట్టర్‌లో వైరలవుతోంది.
ఈ వైరల్ క్లిప్‌ను ఇప్పటివరకూ 50 లక్షల మందికిపైగా వీక్షించారు. ఫ్లైట్ సహాయకుడు టాయ్‌లెట్ ముందు వేచిచూస్తూ ఆపై తలుపు తెరవగానే జంట అభ్యంతరకరంగా కనిపించడంతో అతడు షాక్ తిన్నాడు. వాష్‌రూంలో జంట చేసిన పనికి పలువురు ప్రయాణీకులు నవ్వు ఆపుకోలేకపోగా, మరికొందరు ప్రయాణీకులు అసౌకర్యంగా ఫీలయ్యారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఈజీజెట్ ప్రతినిధి స్పందించారు. సెప్టెంబర్ 8న ఈ ఘటన జరిగిందని, ప్రయాణీకులిద్దరినీ విమానం నుంచి దింపివేశామని తెలిపారు.




