సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ లో వినోద్ మల్టీసూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ను. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా పూజ కార్యక్రమం నిర్వహించారు. చింతా ప్రభాకర్ కు ఆసుపత్రి యాజమాన్యం శాలువాతో సన్మానించారు.
ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. బైపాస్ లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయడం సంతోషం అన్నారు.సంగారెడ్డి పరిసరాల ప్రాంతాల ప్రజలు వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు కోరారు.




