వినాయక మండప నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 15 : ఆమనగల్లు మున్సిపాలిటీలో వినాయక చవితి పండుగ సందర్భంగా మండప నిర్వాహకులు వినాయకుని ప్రతిష్టించే స్థలంలో తప్పకుండా అనుమతి తీసుకోవాలని ఆమనగల్ ఎస్సై బలరాం కోరారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రానున్న వినాయక చవితి సందర్భంగా  మున్సిపాలిటీ ప్రజలు భక్తిశ్రద్ధలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జరుపుకోవాలని సూచించారు. వినాయకుని ప్రతిష్టించే మండపం వద్ద తప్పకుండా కరెంటుకు అనుమతి తీసుకోవాలని కోరారు. రోడ్డుకు మధ్యలో మండపాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని కోరారు. వినాయకుని మండపం వద్ద ప్రతిరోజు ఇద్దరు వ్యక్తులు ఉదయం సాయంత్రం ఉండేవిధంగా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చెక్కల లక్ష్మణ్,  దుడ్డు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *