వినాయకుని ప్రతిమకు ప్రత్యేక పూజలు చేసిన అంగన్వాడి ఉద్యోగులు

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 19 :  అంగన్వాడి ఉద్యోగుల సమ్మె 9వ రోజుకు చేరింది.సమ్మెలో భాగంగా రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో సమ్మె ఈరోజు వినాయక చవితి పండుగ ఉన్నప్పటికీ సమ్మె కొనసాగింది.సమ్మె శిబిరంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు  నిర్వహించి తమ కోరికల వినతిపత్రాన్ని వినాయకునికి  అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ పోచమోని కృష్ణ మాట్లాడుతూ,అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని అన్నారు.అందుకు సమ్మెబాట పట్టడం జరిగింది.8 రోజులుగా సమ్మె చేస్తున్న తమ సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన ప్రభుత్వానికి రావడం లేదు ఆవేదన వ్యక్తంచేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడంలేదని ఆయన బుద్ధి మార్చి మా సమస్యలు పరిష్కరించేలా చూడాలని నేడు వినాయకుడికి పూజలు నిర్వహించి తమ కోరికల వినతిపత్రాన్ని వినాయకునికి అందజేయడం జరిగిందన్నారు.తమ సమస్యలు పరిష్కరించకుంటే ఎన్ని రోజులైనా సమ్మెను ఆపేది లేదని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు పద్మ,లక్ష్మి,జ్యోతి, మంగమ్మ,సుమతి,పద్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *