- అప్పుల ఊబిలోకి నెట్టిన •కేసీఆర్
- వామపక్షలు దోపిడిదారుల వైపా…మా వైపా
- మ్యానిఫెస్టోలో హామీలు ఏవీ నెరవేర్చ లేదు
- ప్రజల్లో మార్పు కోసం యాత్ర
- హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం
- హాత్ సే హాత్ జోడో యాత్ర 5వ రోజు విలేఖరుల సమావేశంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి
ఇల్లందు, ప్రజాతంత్ర, ఫిభ్రదరి 10 : వామపక్ష నాయకులు దోపిడీ దారులైన బిఆర్‌ఎస్ పార్టీ వైపా లేక ప్రజా సంక్షేమం కోసం ప్రజాపక్షన పోరాటం చేసే కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారో వారే తేల్చుకోవాలని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడి్డ అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్ర 5వ రోజు శుక్రవారం ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా లచ్చ్యా తండాలో ఏర్పాటు చేసి విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ… ఆనాడు విద్యుత్ పోరాట సమయంలో వామపక్షాలకు అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేస్తూ నేడు అదే విద్యుత్ సంక్షోభం రాష్ట్రం ఎదుర్కునేలా చేస్తున్న బిఆర్‌ఎస్ పార్టీకి మద్దతుగా నిల్వటం విచారకమన్నారు. రాష్ట్రంలో ఎక్కడా రైతులకు 24 గంటల కరెంటు అందటం లేదన్నారు. సిఎం కెసిఆర్ ధన దాహానికి విద్యుత్ రంగ సంస్థలు సుమారు రూ 60 వేల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టివేయబడిందని ఆరోపించారు.
తక్కువ ధరకు పక్క రాష్ట్రమైన అంధప్రదేశ్ నుంచి విద్యుత్ కోనుకోగులు చేసుకునే అవకాశం ఉన్నప్పటికి కమీషన్ల కోసం తన మిత్ర బృందమైన మైహోమ్ సంస్థ, జీవికే సంస్థలకు వేల కోట్లు కట్టబెట్టారన్నారు. ఛతీస్‌ఘఢ్, భదాద్రి కొత్తగూడెం పవర్ ప్లాంట్‌లతో సరైన సమయంలో ఒప్పంద చేసుకోకపోవటంతో వెయ్యి కోట్టు అదనపు భారం పడిందన్నారు. ఇక యాదాద్రి వవర్ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో రూ వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. విద్యుత్ సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ వ్యవహరా శైలితో ఏ బ్యాంక్ విద్యుత్ సంస్థలకు అప్పు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 బడ్జెట్లలో రూ 23 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. అయితే రాష్ట్రం రూ 5 లక్షల కోట్ల అప్పుల ఊబిలో మునిగిపోయిందన్నారు. రెండు ఎన్నికల్లో ఇచ్చిన వారి మ్యానిఫెస్టోలో పెట్టిన హమీలు ఏవి నేరవేర్చలేదన్నారు. లక్ష రూపాయల రైతు రుణ మాఫీ, పేదలకు డబుల్ బెడ్‌రూయ్, ఆర్హులందరికి ఫించన్‌లు ఇవ్వడం లేదన్నారు.
ఇక నిర్యుదోగుల జీవితాలతో అడుకోకుండా వారు విడుదల చేసిన ఉద్య్ణోగభర్తీల భర్తీ నోటిఫికేషన్లకే పరిమితం చేయండ చూడలన్నారు. కేసీఆర్ కుటుంబం భూ కుంభకోణాకు పాల్పడుతుందన్నారు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఆదివాసీ గిరిజనులకు పోడు హక్కు పత్రాలు ఇస్తే నేడు కేసీఆర్ ఆడవుల సంరక్ష పేరిట సర్వేలు చేయించి దౌర్జన్యంగా లాకుంటున్నారని రేవంత్ మండిపార్డుడు. ఇలాంటి దోపిడారుడైన, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన, విద్యుత్ సంక్షోభం సృష్టిస్తున్న కేసీఆర్‌కు కమ్యూనిస్టులు అండగా ఉంటామనటం వామపక్ష భాజాలనకి వ్యతిరేకమన్నారు. ఇప్పటికైన కమ్యూనిస్టు సోదరులైన తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులు ఎవరిపైపు ఉంటారో ఆలోచించుకోవానల్నారు. ఇదిలా ఉండగా రాంరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రెడ్డి సోదరులు ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సేవ చేశారని, వారు చేసిన ప్రజా సంక్షమం,సేవా కార్యక్రమాలే నేడు ఈ ప్రాంతలో పార్టీ బలంగా ఉండటానికి కారణమన్నారు. మాజీ కేంద్ర మంత్రి బలరామ్ నాయక్, సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకులతో పాటు ఇల్లందు నియోజకవర్గానికి చెందిన నాయకులు, కామేపల్లి కాంగ్రెస్ నాయకులు ప్గాన్నారు.




