విద్యుత్‌ శాఖ బకాయిలు 85 వేల కోట్లు

సిఎం సవిూక్షలో అధికారుల వెల్లడి
పిలిచినా హాజరుకాని ప్రభాకర్‌ రావు
తనను ఎవరూ పిలవలేదన్న సిఎండి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : రాష్ట్రంలో విద్యుత్‌ శాఖ బకాయిలు 85 కోట్లు ఉన్నట్లు తేలింది. శుక్రవారం విద్యుత్‌ శాఖపై  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జరిపిన ప్రత్యేక సవిూక్షలో అధికారులు ఈ విషయం వెల్లడిరచారు. అయితే సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి సీఎండీ ప్రభాకర్‌ రావు  గైర్హాజరయ్యారు. ఈ నెల 3న ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ పదవికి ప్రభాకర్‌ రావు రాజీనామా చేశారు. అయితే రాజీనామాను ఆమోదించవొద్దని, రివ్యూకు హాజరుకావాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. స్వయంగా సీఎం రేవంత్‌ ఆహ్వానించినప్పటికీ సీఎండీ ప్రభాకర్‌రావు సమావేశానికి హాజరుకాని పరిస్థితి ఏర్పడిరది.  విద్యుత్‌ శాఖ అంశంపై గురువారం సీఎం సీరియస్‌ అయిన విషయం తెలిసిందే.

విద్యుత్‌ శాఖలో రూ.85 వేల కోట్ల నష్టం వొచ్చిందని అధికారులు చెప్పినప్పుడు దానిపై పూర్తి వివరాల కోసం సీఎండీ ప్రభాకర రావును సవిూక్షకు రప్పించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ శుక్రవరాం జరుగుతున్న విద్యుత్‌ శాఖ ప్రత్యేక సవిూక్షకు సీఎండీ ప్రభాకర్‌ రావు గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది. అయితే విద్యుత్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సచివాలయంలో నిర్వహించిన సవిూక్ష సమావేశానికి హాజరు కావాలంటూ తనను ఎవరూ పిలవలేదని ట్రాన్స్‌ కో, జెన్కో సిఎండీ దేవులపల్లి ప్రభాకరరావు స్పష్టం చేశారు. తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. కరెంటు లెక్కల్లో అవకతవకలు జరిగాయనీ, అవి తేలేవరకూ సిఎండీ దేవులపల్లి రాజీనామాను ఆమోదించవద్దనీ ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా వార్తలు వొచ్చిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *