విద్యుత్‌ ‌తీగలతో జాగ్రత్త

ప్రమాదాలకు దూరంగా ఉండాలని ట్రాన్స్‌కో హెచ్చరిక
జాహైదరాబాద్‌,‌సెప్టెంబర్‌5:  ‌వర్షాల వేళ ప్రజలు ఇండ్ల వద్ద గ్రత్తగా ఉండాలని ట్రాన్స్‌కో సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. విద్యుత్‌ ‌పరికరాలకు, విద్యుత్‌ ‌తీగలకు దూరంగా ఉండాలన్నారు. బయటకు వెళ్లినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని చెప్పారు. ఎక్కడైనా విద్యుత్‌ ‌తీగలు తెగిపడితే వెంటనే సిబ్బందికి చెప్పాలన్నారు.
లోతట్టు ప్రాంతాలు, భవనాల సెల్లార్లలో నీరు చేరితే తమకు సమారం అందించాలని కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే 1912, 738207214, 7382072106, 7382071574 నంబర్లలో ఫిర్యాదు చేయోచ్చని తెలిపారు. విద్యుత్‌ ‌సమస్యలను వాట్సప్‌, ‌ట్విట్టర్‌, ‌ఫేస్‌బుక్‌ ‌ద్వారా కూడా చెప్పవచ్చని వెల్లడించారు. రాష్ట్రంలో భారీ వర్షాల దృష్ట్యా విద్యుత్‌ ‌సరఫరా పరిస్థితిపై అధికారులతో ట్రాక్స్‌కో సీఎండీ సక్షి నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *