విద్యా రంగంలో మార్పు రాకుంటే..

  • కెసిఆర్‌ ‌ప్రభుత్వాన్ని గ్దదె దింపే వరకు పోరాడతాం
  • ఏబీవీపీ జాతీయ కార్యదర్శి అంకిత పవర్‌
హైదరాబాద్‌, ఆగస్ట్ 2 :‌ నీళ్లు,నిధులు,నియామకాల కొరకు కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్‌ ‌కుటుంబ పాలనతో దోపిడీ చేస్తుందని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి అంకిత పవర్‌  అన్నారు. సీఎం కూతురు కవిత దేశవ్యాప్తంగా ఈ మధ్య లిక్కర్‌ ‌రాణిగా ఫేమస్‌ అయింది తప్ప ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఆమె చేసింది ఏవి• లేదని అన్నారు.
నేను దేశవ్యాప్తంగా విద్యార్థినులు సమస్యలు తెలుసుకొనుటకు పర్యటించడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో బాలికల హాస్టల్స్ ‌లోవిద్యార్థినులతో మాట్లాడుతున్నప్పుడు వారు తమ హాస్టల్ల్సో సౌచాలయాలు లేని కారణంగా చీరలను అడ్డం పెట్టుకొని సౌచాలయాలకు వెళ్లడం జరుగుతుందని చెప్పారు. భారత దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి దయనీయ పరిస్థితి నేను చూడలేదు అన్నారు. ఇంతా దారుణంగా ఏ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయలేదు. ఇక్కడమాత్రం కేసీఆర్‌ ‌ప్రభుత్వం విద్యా వ్యవస్థను విధ్వంసం చేసి తెలంగాణ విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *