విద్యా ప్రదర్శనం

బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి

తన శిష్యులందరూ విలువిద్యలో  ఆరితేరినట్టుగా గ్రహించిన ద్యోణుడు అందరినీ పరీక్షించదలిచాడు. ఒక రోజున  అందరినీ పిలిచాడు. మిక్‌ ‌చెట్టు కొమ్మమీద పిట్టబొమ్మపెట్టాడు. ఆ పిట్ట తలను బాణంతో ఛేదించాలన్నాడు. ఒక్కొక్కరినీ పిలిచి  ఏమి కనబడుతుందని అడిగాడు. ఒక్కొక్కరూ ఒక్కోరకంగా చెప్పారు. చివరగా అర్జునుని పిలిచి అదేవిధంగా అడిగాడు.  అర్జునుడు అందరిలా గాక పక్షి మాత్రమే కనిపిస్తున్నదన్నాడు. ద్రోణుడు బాణాన్ని సంధించమనగానే అర్జునుడు ఆ పక్షి తలను పడగొట్టాడు. మరోసారి మరో సంఘటన జరిగింది. ఆచార్యులవారు నదీ స్నానం చేస్తుంటే ఒక మొసలి పట్టుకుంది. ఆ విషయం తెలిసిన మరుక్షణంలో అర్జునుడు ముసలిని  ముక్క ముక్కలుగా ఖండించి ద్రోణుని కాపాడాడు. అందుకు సంతోషించిన గురువు అర్జునునికి  బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఉపదేశించాడు.

విద్యాభ్యాసం ముగిసిన తర్వాత తన శిష్యుల అస్త్రవిద్యా ప్రదర్శనం ఏర్పాటు చేయమని ధృతరాష్ట్రునికి చెప్పాడు. మహారాజు మహావైభవంగా ప్రదర్శన సన్నాహాలు గావించారు. కృపునికే, ద్రోణుడికి మణిరత్న, భాషణాలూ, చీర చీనాంబరాలూ బహూకరించాడు. రంగస్థలాన్ని మనోహరంగా అలంకరించారు. కుంతి, గాంధారి, తమ సేవకపరివారజనంతో వారివారి ఆసనాలను అలంకరించారు. పెద్దలూ, పౌరజనమూ విచ్చేశారు. మంచి ముహూర్తం సమీపించిన తరువాత వందమంది కౌరవులచేత ఖడ్గ చాలన విద్యను ప్రదర్శింపజేశాడు.
భీమసేనుడూ దుర్యోధనుడూ మదపుటేనుగుల్లా ఘీంకరిస్తూ రంగభూమిలో గదలతో తలపడ్డారు. సముద్రంలో కల్లోలం రేగినట్లుగా విజృంభించారు. ప్రేక్షకుల్లో కోలాహలం. ప్రదర్శన క్రమేసీ విద్వేషాగ్నిని ప్రజ్వల్వింపజేసింది. ఒకరినొకరు అంతం చేసుకోసుకోవాలన్నంతగా సాగిపోతున్న సమయంలో ఆచార్య ద్రోణుడు అశ్వత్థామను పిలిచి ప్రదర్శనను ఆపేశాడు.
ధనుబ్భాణాలు ధరించి అర్జునుడు రంగస్థలానికి రాగానే సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. కుంతి ఎంతో ఆనందించింది. ఆనందాశ్రువులు చిందించింది. మాతృప్రేమ ఒక్కసారి ఉప్పొంగి ఆమెస్తనాలనుండి క్షీరధారలు ఉబికినవట.

అర్జునుడి అస్త్రవిన్యాసం అందరినీ అబ్బురపరిచింది. ఒక్క క్షణంలో రధం మీద కనిపించిన తను మరో క్షణంలో భూమ్మిదవుంటున్నాడు. ఒక అస్త్రంతో అగ్నిని సృష్టించి మరో అస్త్రంతో చల్లారుస్తున్నాడు. పర్జన్యాస్త్రంతో మేఘాలను సృష్టించి, వాయువ్య అస్త్రంతో వాటిని చెల్లా చెదరు చేస్తున్నాడు.
(వొచ్చే సంచికలో…)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *