క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరాలి
లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
దాతల దాతృత్వాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
రామంచ బడి తల్లిదండ్రుల హాజరు..సహకారం అందరికీ ఆదర్శం
జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ
సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరై, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరు కోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి వేలేటి రోజా శర్మ అన్నారు. మంగళవారం మండలంలోని రామంచ ప్రాథమిక పాఠశాలలో సిద్దిపేట లయన్స్ క్లబ్ వారు సమకూర్చిన 73 వేల రూపాయల విలువగల 160 స్పోర్ట్స్ డ్రెస్సులను విద్యార్థులకు పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్లా షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జడ్పి పర్సన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని.. విద్యార్థులు చక్కగా చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి పేరు తేవాలన్నారు. రామంచ ప్రాథమిక పాఠశాలలో దాతల సహకారంతో లక్షలాది రూపాయల విద్యార్థులకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టి ఆదర్శనీయులుగా నిలిచారన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు సురేష్ కుమార్ ఐదేళ్లుగా దాతల సహకారంతో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. లయన్స్ క్లబ్ వారు మారుమూల గ్రామాల్లో చేపడుతున్న సేవలు అభినందనీయమన్నారు. రామంచ గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రుల హాజరు, సహకారం ఉపాధ్యాయుల కృషికి నిదర్శనం అన్నారు. టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాధా కిషన్ శర్మ, ఎంఈఓ దేశి రెడ్డి, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్ గంప రమేష్, సర్పంచ్ సంతోషి, ఎంపీటీసీ వెంకటలక్ష్మి లు మాట్లాడుతూ మండలంలోని రామంచ ప్రాథమిక పాఠశాల ఇంకా ఆదర్శంగా నిలుస్తుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి నెలలో నిర్వహించే సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరు కావడం శుభసూచకమన్నారు. చేయుటను విద్యార్థులు, గ్రామస్తులు సద్వినియోగం చేసుకుని అందరికీ ఆదర్శనీయులుగా నిలువాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాములు, సురేష్ కుమార్,సునీత, వాణి, ఎస్ఎంసి చైర్మన్ రవి, వైస్ చైర్మన్ భారతి, నాయకులు విక్రమ్, యాదవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




