విద్యార్థులు పుస్తక పఠనాన్ని పెంపొందించుకోవాలి

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్ ప్రతినిధి,జూలై 19 : చేవెళ్ల మండల పరిధిలోని అంతారం ఎంపీపీఎస్ (మండల పరిషత్‌ పాఠశాల)ను స్కూల్‌ కాంప్లెక్స్​​‍ హెడ్‌ మాస్టర్‌ శంకరయ్య బుధవారం సందర్శించారు.తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ఆయన పాఠశాలలోని తరగది గదులకు వెళ్లి విద్యార్థులతో పుస్తక పఠనం చేయించి ప్రశంసించారు.అనంతరం మధ్యాహ్నభోజనాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా స్కూల్‌ కాంప్లెక్స్​​‍ హెడ్‌ మాస్టర్‌ శంకరయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు పుస్తకపఠనాన్ని పెంపొందించుకొని,క్రమశిక్షణతో కూడిన విద్యనభ్యసించాలన్నారు.ప్రతి విద్యార్థి చదవడం,రాయడం తప్పని సరిగా నేర్చుకోవాలని సూచించారు.హెడ్‌ మాస్టర్ మాణిక్యరావు,పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *