కుల్కచర్ల, ప్రజాతంత్ర, నవంబర్ 16:విద్యార్థులు క్రీడలలో రాణించి ఉజ్వల భవిష్యత్ బాటలు వేసుకోవాలని పాఠశాల పూర్వ విద్యార్ధి
కాకి గోపాల్ జడ్పిహెచ్ఎస్ ముజాహిద్ పూర్ ఉన్నత పాఠశాల పాఠశాల విద్యార్థులకు 20 మందికి క్రీడా దుస్తులను అందజేశారు.ఇంతకుముందు జిల్లా స్థాయిలో క్రీడల్లో క్రీడా దుస్తులు లేకుండా ఆడీన విద్యార్థులను చూసి ఆ పాఠశాల పూర్వ విద్యార్థిగా తనవంతు పోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు పిడి వెంకటేశ్వర్లు పాఠశాల పూర్వ విద్యార్ధిని అభినందించారు.దాతలు ముందుకు వచ్చి విద్యార్థులకు చదువు, క్రీడాల పరంగా విద్యార్థులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.





