కూకట్ పల్లి ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : విద్యార్థులు చదువుతో పాటు సామాజిక, సాంస్కృతిక, క్రీడలతో పాటు అన్ని రంగాలపై అవగాహన పెంచుకుని ఆల్ రౌండర్లుగా ఎదగాలని డీజీఎం వేణు గోపాల్ రెడ్డి సూచించారు. బుధవారం కూకట్ పల్లిలోని నారాయణ విద్యాసంస్థలు నిర్వహించిన క్రీడా పోటీలలో స్థానిక 8 నారాయణ పాఠశాలల (ఈకేపీ, ఎండీ గకాస్, కేపీ, ఈఎల్పి, ఎన్పిఎస్, ఇబగ్స్, ఒకేపీ, ఇవిఎన్) విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డీజీఎం గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో ప్రగతిని సాధించాలని కోరారు. భారత దేశానికి క్రీడా రంగంలో ఆటగాల్లని అందించాలనే దృక్పథమే ఈ క్రీడా సదస్సును నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశ్యమని సూచించారు. అనంతరం విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ట్రోఫీ లను అందించారు. ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాలల ప్రిన్సిపల్స్, రీజినల్ ఇంచార్జీలు, పిఈటి డిపార్ట్మెంట్ అధినేత కమలాకర్, ఏ.ఓ లు, పిఈటి లు, సాప్ట్ స్కిల్స్ బృందం, ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు క్రీడలతో పాటు అన్ని రంగాలపై అవగాహన పెంచుకోవాలి





