ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 19 : విద్యార్థినీ విద్యార్థులు ప్రతి పోటీ పరీక్షలను కష్టం అనుకోకుండా ఇష్టపడి చదువుకోవాలని ఆమనగల్లు సిఐ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం జ్ఞాన వాహిని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమనగల్లు, మాడుగుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలలో 6, 7, 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు చూచి వ్రాయు పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సి ఐ వెంకటేశ్వర్లు ఎస్సై బలరాం నాయక్ మాజీ మండల పరిషత్ అధ్యక్షులు టి. లతమ్మ వెంకటయ్య పాల్గొన్నారు. జ్ఞానవాహిని ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ బి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు డి. శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు విశ్రాంత ఉపాధ్యాయులు సత్యనారాయణ, కార్యదర్శి లక్ష్మీనారాయణ, కోశాధికారి రవీందర్, సభ్యులు సత్యం, బి. నరసింహ, రంగారావు, జగదీష్, యాదగిరి, దినేష్, శ్రీనివాసులు, సాయి బాబా, సతీష్ పాల్గొన్నారు.
విద్యార్థులు ఇష్టపడి చదువుకోవాలి





