ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 2 : కడ్తాల మండలంలోని గడ్డమీది తండా గ్రామపంచాయతీ ప్రభుత్వ పాఠశాలలో జియంటి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు బుక్కులు, పెన్నులు పలకలను గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు జీ ఎం టీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నోట్ బుక్కులు, పెన్నులు పెన్సిల్ పంపిణీ చేసినందుకు ఆ యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి లచ్చిరాం నాయక్, ఉపసర్పంచ్ రమణ నాయక్, యూత్ అధ్యక్షులు శివ, ఉపాధ్యక్షులు కళ్యాణ్, నాయకులు రవి, బన్సీ, పంతు, గణేష్, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు నాయకులు తదితరులు పాల్గొన్నారు.



