విద్యార్థులకు  ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా యూనిఫామ్ ల పంపిణీ

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 : తలకొండపల్లి మండలం బల్సులపల్లి తాండా గ్రామపంచాయతీ లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో 30 మంది విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లను పంపిణీ చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో పాఠశాలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తనవంతుగా ట్రస్టు ద్వారా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి నాయక్, ఫ్రెండ్స్ యూత్ ప్రెసిడెంట్ నవీన్ నాయక్, రాథోడ్, యూత్ ప్రెసిడెంట్ యాదగిరి నాయక్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *