శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉదయం పూట ఆకలి తీర్చే గొప్ప పథకం సీఎం బ్రేక్ పాస్ట్ అని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారంగచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల లోని మండల ప్రాథమిక పాఠశాల లో సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ,ఎం ఈ ఓ వెంకటయ్య , కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి , జగదీశ్వర్ గౌడ్ , మాజీ కార్పొరేటర్ సాయి బాబా లతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి విద్యార్థుల తో కలిసి బ్రేక్ పాస్ట్ చేశారు .ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ విద్యార్థులకు ఉదయం పూట ఆకలి తీర్చే గొప్ప పథకం సీఎం బ్రేక్ రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల విద్యార్థులకు ఉపయోగపడుతుంది అని పేర్కొన్నారు శేరిలింగంపల్లినియోజకవర్గంలో 73 ప్రభుత్వ పాఠశాలలో 22,000 విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది అని ఆయన తెలియచేసారు. సీఎం కేసీఅర్ బ్రేక్ ఫాస్ట్ కేవలం విద్యార్థుల కడుపు నింపే కార్యక్రమం మాత్రమే కాకుండాస్కూల్స్ లో డ్రాప్ ఔట్స్ తగ్గించి, బడి బాట పట్టించి, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తెచ్చే గొప్ప పథకందేశంలో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్టం అని సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం విద్యా వ్యవస్థలో సమూల మార్పు తెస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఒక పథకం అమలు చేసే ముందు ప్రజా కోణంలో ఆలోచిస్తారని అందుకే అవి విజయవంతం అవుతు సామాజిక మార్పుకు కారణం అవుతు దేశానికే ఆదర్శంగానిలుస్తున్నాయన్నారు. ఆడపిల్లల కోసం ప్రత్యేక విద్యాలయాలు, ఇంగ్లీష్ మీడియంలో చదువు 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణఅని పునరుద్ఘాటించారు.దసరా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు అవుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
విద్యార్థులకు ఉదయం పూట ఆకలి తీర్చే పథకం సీఎం బ్రేక్ పాస్ట్




