ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 2 : విద్యార్థిని విద్యార్థులు తప్పనిసరిగా ప్రస్తుత సమాజంలో ఆత్మ రక్షణ కొరకు మార్షల్ ఆర్ట్ తప్పనిసరి నేర్చుకోవాలని గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని లిటిల్ స్కాలర్ టెక్నో స్కూల్లో స్థానిక బి ఆర్ ఎస్ నాయకుడు పత్య నాయక్ తో కలిసి మార్షల్ ఆర్ట్ క్లాసు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కరాటే నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సరిత పంతు నాయక్, సర్పంచ్ సోనా శీను నాయక్, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు చుక్క అల్లాజి గౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




