విద్యార్థితోనే సమాజంలో చక్కటి గుర్తింపు లభిస్తుంది.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్టు 7: అన్ని సంపదల కన్నా విద్యాభివృద్ధి సంపాదన ఎంతో గొప్పనైనదని విద్యార్థులు సమాజంలో చక్కటి గుర్తింపు లభించాలంటే విద్యాభివృద్ధి తో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో వికారాబాద్ జిల్లా క్రీడా మరియు యువజన శాఖ  నిర్వహించిన జిల్లా స్థాయి యువ ఉత్సవ్ 2023 కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ భవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నత విద్యావంతులుగా ఎదిగి ఈ ప్రాంతానికి సేవలందించి చక్కటి గుర్తింపు తీసుకోవాలని ఆయన తెలిపారు. గొప్ప గొప్ప చదువులు చదివి ఇతర దేశాలకు వెళ్లి సేవలందించడం కంటే మన ప్రాంతంలోని సేవలు అందించి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలన్నారు. ఎన్ని సంపదలు సృష్టించిన విద్యాభివృద్ధికి సరితూగదని విద్యార్థులు అనుకున్న గోల్ చేరేవరకు ఎన్ని అడ్డంకులు ఎదురు వచ్చినా వాటిని అధిగమించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెహ్రు యువజన కేంద్రం జిల్లా అధికారి ఐసయ్య, జిల్లా యువజన క్రీడల అధికారి హనుమంతరావు కౌన్సిలర్ అనంత్ రెడ్డి ఎంపీపీ చంద్రకళ కమల్ రెడ్డి ధరూర్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి  సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి. ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *