మహేశ్వరం టౌన్ ప్రజాతంత్ర, జూలై 15: ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి పాఠశాలలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుట్టం పురుషోతం రావు అన్నారు. శనివారం సరూర్నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రామోజీ వీరమ్మ బ్రహ్మచారి మెమోరియల్ ట్రస్టు తరుపున. పదోతరగతి లో టపర్లకు మెమోటోలు 2 వేల రుపాయాలు సర్టిఫికేట్లు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భాంగా వారు మాట్లాడుతూ స్థానిక ఉన్న ప్రజాప్రతినిధులు పాఠశాల అభివృద్ధి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకుడు బేర బాలకిషన్ ట్రస్ట్ అధ్యక్షులు ఆర్. సద్గుగా చారి, ఉపాధ్యక్షులు ఆర్. శ్రీదర్ సభ్యులు ఆర్. అరపాద కుమార్. డా స్నేహ జిగేశ, ఉమామహేశ్వరి పాఠశాల ప్రధానోపాధ్యాయు ఉమాదేవి మాజీ కార్పొరేచర్. త్రివేది. లయన్స్ క్లబ్ మెంబర్ డా జంగయ్య యాదవ్ కొట్టం తదితరులు పాల్గొన్నారు.




