విదేశీ విద్యకు సహకారం : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటిఆర్

హయత్ నగర్ , ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : తెలంగాణకు చెందిన విద్యార్థులకు విదేశాలలో  విద్యనభ్యసించేందుకు తమ ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కె. తారక రామారావు అన్నారని దిల్ సుఖ్ నగర్ లోని వీసా 9 కార్యాలయం ఎండి సాయికుమార్ మేడి ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికాలోని చికాగోలో శనివారం రాత్రి జరిగిన సమావేశంలో తమ సంస్థను అభినందించారని తెలిపారు. ప్రతి ఏటా విదేశాలలో ఉన్నత విద్యకోసం ఎంతో మంది విద్యార్థులను అబ్రాడ్ పంపిస్తున్న వీసా 9 కు శుభాకాంక్షలు తెలిపారు. అబ్రాడ్ వెళ్లే విద్యార్థులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీలలో మాత్రమే తమ సంస్థ అవకాశం కల్పిస్తుందని ఆయన తెలిపారు. చదువు పూర్తి కాగానే ప్లేస్ మెంట్ లు త్వరితగతిన దొరికే యూనివర్సిటీకు తమ సంస్థ ద్వారా అడ్మిషన్ అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *