న్యూ దిల్లీ, ఫిబ్రవరి 11 : కొరోనా కేసులు తగ్గుతుండడంతో అంతర్జాతీయ రాకపోకలకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సవరించింది. ఈ నెల 13 నుంచి చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులు ‘కొరోనా టెస్ట్ రిపోర్ట్’ని సమర్పించాల్సిన అవసరంలేదని తెలిపింది. వారి ఆరోగ్య సమాచారాన్ని కూడా సేకరించాల్సిన పనిలేదని వెల్లడించింది. గడిచిన నాలుగు వారాలుగా ఈ దేశాల్లో కరోనా కేసులు తగ్గుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.

