విఠాయిపల్లిలో దళితుల ఆత్మీయ సమ్మేళనం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 9 :   ఆమనగల్లు మున్సిపాలిటీలోని విఠాయిపల్లి గ్రామంలో బుధవారం  కల్వకుర్తి తాలుక స్థాయి దళితుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చించారు. తాలుక స్థాయి దళితుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పార్టీలకతీతంగా దళితులు అందరూ కలిసి ఈ సమావేశంలో పంచుకోవాలని పలువురు సూచించారు. ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ కడ్తాల మండల అధ్యక్షుడు కంబాలపల్లి పరమేష్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కల్వకుర్తి తాలూకాలోని దళితుల సంఘటిత కార్యక్రమాలు చేయాలని ఎలాంటి సమస్య వచ్చినా అందరూ కలిసికట్టుగా పోరాడే విధంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఆయన సూచించారు. మరొకసారి దళితులందరూ సమూహమై తాలుకలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేయాలి అన్నారు. ఒక్కొక్క మండలం నుంచి 20 నుంచి 30 మంది వరకు తమ తమ అభిప్రాయాలు తెలియజేసి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కంబాలపల్లి పరమేష్, అంబేద్కరిస్ట్ సుధాకర్, గుమ్మకొండ రాజు, విఠాయి పల్లి రమేష్, దరువుల శంకర్, జోగు రమేష్, మంగళపల్లి నరసింహ, బిక్షపతి రాము, శీను, కట్ట జంగయ్య, ఒగ్గు మహేష్, సురమళ్ళ సుభాష్, మైసయ్య, భీమయ్య, బాలరాజు, రమేష్, నరసింహ, కృష్ణ మాదిగ, చందు, దామోదర్, కృష్ణయ్య, సుధాకర్, చిన్న, శివ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *