అలుపు అవకాశానికి
నన్ను కాదని పరిగెడుతున్నందుకు!
విసుగు దురదృష్టానికి
నన్ను ఇంతకన్నా సాధించలేనందుకు!
ఏడుపు ఓరిమికి
వీడు నాకే గురువయ్యాడని!
భయము ఓటమికి
వీడు నన్నే జయిస్తాడేమోనని?
విసుగొచ్చిన అవకాశం
నా ఒళ్ళో వాలదా?
విరహమెక్కిన అదృష్టం
నా కౌగిలిలో చేరదా?
ఓర్పుకి విజయం రాదా?
ఓటమికి పరాజయం లేదా?
నల్లటి రోతలన్నీ
తెల్లటి ఆకాశంలో తేలిపోవా?
కన్నీటి రాతలన్నీ
కడలి గర్భంలో కలిసిపోవా?
నిన్నటిని మొన్నటిగా చేసిన
కుదురులేని కాలం
నేటిని నిన్నటిగా చేయదా?
రేపటిని నేటిగా మార్చదా?

    – ఉషారం
9553875577

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *