విజయ్ రాథోడ్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ 

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 : అమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా గ్రామపంచాయతీ కి చెందిన బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్త విజయ్ రాథోడ్ రెండు కిడ్నీలో  రాళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతు అవస్థతకు గురయ్యారు. వెంటనే హైదరాబాద్ లోని  హయత్ నగర్ మ్యాక్సీ క్యూర్ హాస్పిటల్ లో చేర్పించారు. గురువారం ఆపరేషన్ జరిగిన విషయం తెలుసుకున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆసుపత్రికి వచ్చి విజయ్ రాథోడ్ ను  పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులకు మంచి వైద్యం అందించాలని సూచించారు. వారి వెంట బీ.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు గోళి. సురేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, భాస్కర్, సందీప్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *